బ్లాక్, వైట్‌ ఇప్పుడు మూడోరకం.. ఎళ్లో ఫంగస్‌! ఇది మరింత ప్రమాదం

-

ఇప్పటికే బ్లాక్‌ ఫంగస్‌ విజృంభిస్తోంది. కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఈ ఫంగస్‌ బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇదిలా ఉండగా వైట్‌ ఫంగస్‌ కూడా వచ్చింది. ఇప్పుడు తాజాగా ఎళ్లో ఫంగస్‌ కేసులు బయటపడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఎళ్లో ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ఎళ్లో ఫంగస్‌ బ్లాక్, వైట్‌ కంటే మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ బారిన పడిన వారు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


ఎళ్లో ఫంగస్‌ లక్షణాలు

  • సొమ్మసిల్లడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం ఇది సిరీయస్‌ అయితే గాయాల నుంచి చీము కూడా కారుతూ ఉంటుంది. గాయాలు కూడా త్వరగా మానిపోవు, కళ్లు వీక్‌గా కనిపిస్తాయి.
  • ఎళ్లో ఫంగస్‌ ఇంటర్నల్‌ పార్ట్స్‌లో మొదలవుతుంది. మీరు దీన్ని గుర్తించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లో చికిత్స తీసుకోవడం మంచిది.
  • ఈ ఎళ్లో పంగస్‌కి అంపోటెరిసిన్‌ బీ అనే ఇంజెక్షన్‌ ఇస్తారు. ఇది యాంటీ ఫంగస్‌ మెడిసిన్‌గా పనిచేస్తుంది.
  • బ్యాడ్‌ హైజీనిక్‌ వల్ల ఎళ్లో ఫంగస్‌ సోకుతుంది. మీ పరిసర ప్రాంతాలను సాధ్యమైనంత వరకు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఆహారం కూడా ఎప్పటికప్పుడు వేడిగా వండుకోవాలి. ఏదైనా పాత ఆహార పదార్థాలు ఉంటే వెంటనే బయట పడేయండి, లేకపోతే అందులో ఫంగస్‌ డెవలప్‌ అవుతుంది.
  • ఇంటి ఆవరణలో తేమను కూడా ఎప్పటికప్పుడు చెక్‌ చేయాలి. ఫంగస్‌ పెరగకుండా చూసుకోవాలి.
  • ఇంట్లో సరైన తేమశాతం 30–40 శాతం వరకు ఉండాలి. తేమ తక్కువ ఉండేలా పరిసరాలు ఉండాలి. ఎక్కువ మాయిశ్చర్‌గా ఉండకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news