మే 27, 28 తేదీలలో డిజిటల్ ప్లాట్‌ఫారంలో మహానాడు అని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన టీడీపీ పొలిట్ బ్యూరో… బీసీ జనార్థనరెడ్డి సహా టీడీపీ కార్యకర్తలపై కేసుల్ని ఖండించింది. దాడి చేసి దాన్ని కప్పిపెట్టుకోవడానికి టీడీపీ నేతలపై ఎదురు కేసులు పెడుతున్నారని ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాజకీయ కక్ష కోసం జగన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించింది.
ప్రతిపక్షాల్ని దెబ్బతీయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హైకోర్టు చెప్పింది అని కరోనా బాధితులకు సహాయం చేయడానికి వెళ్తే అరెస్టు చేయడం దుర్మార్గం అని మండిపడింది. ఆనందయ్య కరోనా మందు నిలిపివేత సరికాదు అని మందువల్ల ప్రమాదం లేదని ఆయుష్ వారు ప్రకటించారు అని పేర్కొన్నారు. వైసీపీ డ్రగ్ మాఫియా ఒత్తిడితోనే మందు పంపిణీ నిలిపివేశారు అని మండిపడింది.