పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి

-

పాకిస్తాన్: ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం చెందారు.  చాలా మందికి గాయాలయినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెతి-దహర్కి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిగ్నలింగ్‌లో ఏర్పడిన సమస్య వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. స్థానిక రైల్వే సిబ్బందిని విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై రైల్వే మంత్రికి సమాచారం అందజేశారు. కాసేపట్లో ప్రమాదం జరిగిన చోటుకు వెళ్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news