ముంబయిని ముంచెత్తిన వరద.. నెక్ట్స్ తెలుగు రాష్ట్రాలేనా?

-

మహారాష్ట్ర: దేశ ఆర్ధిక రాజధాని ముంబయిని భారీ వరద ముంచెత్తింది. నైరుతీ రుతుపవనాలు దేశంలో విస్తరించాయి. దీని ప్రభావం మహారాష్ట్రపై పడింది. ముంబయి మహానగరంలో భారీ వర్షం కురవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీ వరదతో పాటు రైల్వే ట్రాక్‌లపై నీళ్లు నిలిచిపోవటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ముంబయి సెంట్రల్. ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్, దాదర్, లోకమాన్య తిలక్ టెర్మినస్‌ నుంచి వివిధ రైళ్ల రాకపోకలు ఆలస్య మయ్యాయి. వాతావరణ శాఖ ఊహించని దానికంటే మహారాష్ట్రలోకి ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయని అధికారులు అన్నారు. ముంబయితో పాటు పరిసర ప్రాంతాల్లో సాధారణ వర్షపాతంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించారు. ముంబయి చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ముంబయి కొలాబా ప్రాంతంలో 77 మిల్లీమీటర్ల నడిందని వాతావరణ శాఖ తెలిపింది.

ముంబయి తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో దాదాపు 50 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. బేలాపూర్‌లో 168 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షం వల్ల ముంబయిలో లోతట్టు ప్రాంతాలు, కింగ్ సర్కిల్ గాంధీ మార్కెట్ ఏరియా, సియోన్, మిలన్, విలే పార్లే ఏరియాలు నీటమునిగాయి. ముంబయికి ప్రాణాధారమైన లోకల్ రైళ్ల రాకపోకలపై భారీ వర్షాలు ఆటంకంగా మారాయి. వచ్చే రెండ్రోజుల్లో మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మీదగా ఒడిషాకు రుతుపనవాలు విస్తరించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news