ఈటల రాజేందర్ (Etela Rajender) అంటే నిఖార్సయిన ఉద్యమ నేతగా పేరుంది. కేసీఆర్ తర్వాత ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారనే గుర్తింపు ఆయన సొంతం. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఆయన టీఆర్ఎస్ను వీడారు. అంతేకాదు ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ రాజీకీయాలు ఇప్పుడు మంచి హీటుమీదున్నాయి.
అయితే ఆయన భారీ అనుచరగనంతో ఈరోజు బీజేపీలో చేరారు. మరి ఈటల రాజేందర్ అంటేనే తెలంగాణలో పెద్ద పట్టున్న బీసీ నేత. అందుకే ఆయన్ను చేర్చుకోవడానికి బీజేపీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మరే నేతకు ఇవ్వనంత ప్రాముఖ్యతను ఈటల రాజేందర్‌కు ఇచ్చారు కమలనాథులు.
అయతే మరి ఈటల రాజేందర్ చేరికతో బీజేపీ దశ మారనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో కొత్త దశ మొదలవుతుందనే చెప్పాలి. ప్రజల్లో ఇప్పుడు టీఆర్ ఎస్ మీదున్న వ్యతిరేకత బీజేపీకి బాగానే కలిసొస్తుంది. కాంగ్రెస్ మీద నమ్మకం లేకపోవడంతో అందరూ బీజేపీ వైపే చూస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ ఎస్ అసంతృప్తులు మొత్తం బీజేపీకి జై కొడుతున్నారు. ఇప్పుడు టీఆర్ ఎస్‌లో ఉన్న చాలామంది అసంతృప్తులు, పదవులు రాని వారు కూడా ఈటల వెంట బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈరోజు ఈటల కూడా ఇదే విషయాన్ని చెప్పారు.