నాగబాబు ఫైనల్ పంచ్ టూ బాలకృష్ణ.. ఎర్రోడి వీరగాథ..!

-

రెండు రోజులుగా బాలకృష్ణ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ హాట్ న్యూస్ గా మారిన నాగబాబు ఫైనల్ పంచ్ గా ఎర్రోడి వీరగాథ షార్ట్ ఫిల్మ్ తో తన చెప్పదలచుకున్న విషయాన్ని మొత్తం చెప్పాడు. రెండు రోజులుగా బాలకృష్ణని మాటలతో టార్గెట్ చేసిన నాగబాబు ఎర్రోడి వీరగాథలో ఓ క్యారక్టర్ ని పెట్టి ఆడవాళ్లతో కొట్టించేశాడు. ఓ ఆడియో రిలీజ్ సందర్భంలో ఆడాళ్లను చూసి ముద్దైనా పెట్టాలి.. కడుపైనా చేయాలని బాలకృష్ణ అన్న కామెంట్స్ అప్పట్లో హాట్ గా మారాయి. ఇప్పుడు అదే విషయాన్ని మళ్లీ గుర్తుచేస్తూ నాగబాబు ఈ వీడియో చేయించారు.

చిట్టి అనే వ్యక్తిని ఆడవాళ్లంతా కొడుతుంటే ఎందుకు కొడుతున్నారో అని తెలుసుకుందామని వెళ్తాడు నాగబాబు. ఇంతకీ చిట్టి ఏం చేశావని వాళ్లు నిన్ను కొడుతున్నారు అంటే ఆడవాళ్లకి ముద్దైనా పెట్టాలి.. కడుపైనా చేయాలని పెద్దవాళ్లు చెప్పారని తాను ముద్దు పెడదామని ట్రై చేస్తేనే కొడుతున్నారని అంటాడు. వారి నుండి కాపాడిన నాగబాబు మళ్లీ ఆ ఆడవాళ్లకు చిట్టిని అప్పగిస్తాడు. ఇది ఎర్రోడి వీరగాధ కథాంశం. బాలకృష్ణకి ఫైనల్ పంచ్ గా నాగబాబు చేసిన ఈ వీడియో షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లు మాటలతో దాడి చేసిన నాగబాబు ఏకంగా వీడియో కూడా చేశాడు అంటే దీనిపై నందమూరి ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news