“మా” ఎన్నికల బరిలో జీవితా రాజశేఖర్ నిలబడడానికి కారణం అదేనా?

-

మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ అధ్యక్ష పదవి కోసం జరిగే ఎన్నికలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచువిష్ణు బరిలోకి దిగడంతో ఈ ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. ఐతే తాజాగా జీవితా రాజశేఖర్ కూడా అధ్యక్ష పదవిలో బరిలో నిలవనుంది. గతంలో “మా” సెక్రటరీగా పనిచేసిన జీవితా రాజశేఖర్, బరిలోకి దిగడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. మరి జీవితా రాజశేఖర్ గెలవడానికి ఏయే అంశాలు కలిసి రానున్నాయనేది ఒక్కసారి విశ్లేషిస్తే, ప్రధానంగా మూడు కనిపిస్తున్నాయి.

సెక్రటరీగా పనిచేసిన అనుభవం వల్ల చాలామంది జీవితా రాజశేఖర్ గారి అండగా ఉంటారనడంలో సందేహం లేదు. అలాగే గత ఎలక్షన్లలో రాజశేఖర్ కి జరిగిన సంఘటన, చాలామందికి ఇంకా గుర్తుంది. ఈ విషయంలో జీవిత వైపు నిలబడేవాళ్ళు ఉన్నారు. అదీగాక కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీ బీజేపీ నాయకులతో రాజశేఖర్ దంపతులకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని చాలా మంది ఆర్థికంగా సాయం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జీవితా రాజశేఖర్ కి చాలా బలం ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరేం జరుగుతుందో!

Read more RELATED
Recommended to you

Latest news