హైదరాబాద్: ఆయిల్ ధరలు ప్రతి రోజూ షాక్ ఇస్తున్నాయి. గత 3 వారాలుగా పెరగడమే కాని తగ్గిందిలేదు. దీంతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. కరోనా కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమపై ఈ బాదుడు ఏందంటా అని వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ధరల తగ్గుదలపై దృష్టి పెడితే బాగుంటుందని అంటున్నారు. పెట్రోల్ ఇలానే పెరిగితే మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరిస్తున్నారు. ఆయిల్ ధరల పెరగడం వల్ల నిత్యావసరాలపై తీవ్ర ప్రభుత్వం చూపుతుందని పేర్కొంటున్నారు.
ఇక ఆయిల్ ధరల విషయానికి వస్తే మళ్లీ పెరిగాయి. రోజు వారిలాగే ఆదివారం కూడా ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్ పై 27 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.32గా ఉంది. డీజిల్ ధర రూ. 96,90గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇక జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రికార్డు స్థాయిలో విక్రయిస్తున్నారు. లీటర్ పెట్రోల్ రూ. 105.18కాగా డీజిల్ లీటర్ రూ. 97.99గా ఉంది.
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు: