లీకైన పవర్ స్టార్ మూవీ మేకింగ్ వీడియో.. నెట్టింట్లో వైరల్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు వింటేనే ఆయన అభిమానులు పూనకం వచ్చిన మాదిరిగా ఊగిపోతుంటారు. వకీల్ సాబ్ సినిమా బిగ్గెస్ట్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి సారి ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో సాగుతుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు మోషన్ వీడియో కూడా మేకర్స్ అభిమానుల కోసం రిలీజ్ చేశారు. కాగా వీటికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కంచె, గమ్యం వంటి విలక్షణ సినిమాలకు దర్శకత్వం వహించి.. విమర్శకులతో సైతం ప్రశంసలందుకున్న క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం మేకింగ్ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను ఎవరూ మేకర్స్ పోస్ట్ చేయలేదు. కానీ ఎవరో ఆకతాయి ఈ వీడియోను లీక్ చేశాడు. కానీ ఈ వీడియోతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ పండుగ చేసుకుంటున్నారు. లీకయిన వీడియోతోనే ఈ విధంగా రచ్చ చేస్తే… ఇక సినిమా టైంకు ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

పవర్ స్టార్ / pawankalyan

ఇదివరకు కాలంలో చిత్రీకరణ దశలో ఉన్న సినిమా గురించి ఎటువంటి ఫొటోలు, వీడియోలు కనిపించేవి కావు. కానీ ప్రస్తుత యుగంలో పరిస్థితులు మారిపోయాయి. పవన్ కల్యాణ్ వీరమల్లు మూవీ నుంచి లీకయిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్నది ఒక యాక్షన్ సీన్ అని తెలుస్తుంది. మల్లయోధులతో పవన్ చేసే పోరాటం చూస్తుంటే… ఫిదా అయిపోవాల్సిందే. అంతే కాకుండా దర్శకుడు యాక్షన్ చెప్పేది, కట్ చెప్పేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా వినిపిస్తోంది. ఈ సినిమాలో అందాల మద్దుగుమ్మ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news