ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాజా అధ్యయనం ప్రకారం దేశంలో కరోనా వల్ల మరణించిన వారిలో ఎక్కువ మంది 50సంవత్సరాల లోపు వారే ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా ప్రకారం కరోనా కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో 60సంవత్సరాల పైబడ్డ వారికంటే 50సంవత్సరాల లోపు వారే ఎక్కువగా ఉన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ నుండీ జులై 24వ తేదీ వరకు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
కరోనా వచ్చిన వారు మరణించడానికి కారణాలు వెతికే క్రమంలో జరిపిన ఈ అధ్యయనంలో అనేక విషయాలు బయటకి వచ్చాయి. ఈ పరిశోధన జరిపిన కాలంలో మొత్తం 654మంది యువత ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. అందులో 247మంది కరోనా కాటుకి బలయ్యారు. అంటే 37.7% ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులోని వారికి రకరకాల వయసుల వర్గాలుగా విభజించారు. 18 నుండి 50, 51 నుండి 65, 65 ఆపైన. ఐతే 18 నుండి 50సంవత్సరాల మరణాల శాతం 42.1%గా ఉంటే, 51-65వారికి 34.8%గా, 65ఆపైన వారికి 23.1%గా ఉంది.