తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ నీటి వివాదం రోజు రోజుకీ ముదురుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఎన్జీటీకి కంప్లైంట్ ఇచ్చినప్పటి నుండి పెరుగుతున్న ఈ వివాదంలో ఇరు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాస్తున్నాయి. కావాల్సిన దానికంటే ఎక్కువ నీళ్ళు తెలంగాణ వాడుకుంటుందని, శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆరోపిస్తుంటే, శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కోసమే అని తెలంగాణ చెబుతుంది.
ఇదిలా ఉంటే, తాజాగా ఆంధ్రప్రదేశ్ సీపీఐ కార్యదర్శి కె రామక్రిష్ణ లేఖ రాసారు. ఎపీ సీఎం జగకు రాసిన ఆ లేఖలో ఈ విధంగా ఉంది. కేంద్రానికి లేఖలు రాయవడం వల్ల పనులు జరగవని, శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని తెలంగాణ ఖాళీ చేస్తుందని, అలా అయితే రాయలసీమకి చుక్కనీరు కూడా దొరకదని, ఈ విషయంలో అఖిల పక్షాలకు కలుపుకుని ముందుకు వెళ్ళాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అదొక్కట్టే మార్గమని లేఖలో పేర్కొన్నారు.