వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తరువాత భారత క్రికెట్ జట్టు ఇంటా బయటా అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. కనీసం పోరాటం కూడా చేయకుండానే చేతులెత్తేశారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే భారత జట్టు మాత్రం త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ సిరీస్ కోసం గట్టిగా సాధన చేస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగే 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది.ఇక ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు భారత ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లి(Kohli) జిమ్‌లో సాధన చేస్తున్నాడు.
నెట్స్‌లోనూ గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే జిమ్‌లో బరువులు ఎత్తేటప్పుడు ఓ వీడియో తీసి దాన్ని కోహ్లి స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియోను అతను అలా పోస్ట్ చేశాడో లేదో ఫ్యాన్స్ ట్రోల్ చేయడం ప్రారంభించారు.
View this post on Instagram
గత కొద్ది నెలలుగా క్రికెట్ ఆడడంలో ఫెయిలవుతున్నావని కొందరు యూజర్లు కామెంట్లు చేయగా, కొన్ని నెలలుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదని కొందరు కామెంట్లు చేశారు. ఇక కోహ్లి రిటైర్ అయితే మంచిదని కొందరు కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే కోహ్లిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
కాగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆగస్టు 4 నుంచి 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 10న ఆ సిరీస్ ముగియనుంది.