జమ్మూకశ్మీర్: భారత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో గుంటూరు జిల్లా జవాను వీరమరణం పొందారు. రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టారు. ముష్కరుల కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతి చెందారు. బాపట్ల మండలం దరివాదకొత్తపాలెం వాసి మరుపోలు జశ్వంత్‌రెడ్డి (23) అమరులయ్యారు. ఐదేళ్ల క్రితం జశ్వంత్‌రెడ్డి సైన్యంలో చేరారు. జశ్వంత్‌రెడ్డి మృతితో దరివాద కొత్తపాలెంలో విషాదచాయలు అలముకున్నాయి.
ఈ ఘటనతో జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో భారీగా విధ్వంసం సృష్టించేందుకు ముష్కరమూకలు ప్రయత్నాలు చేస్తున్నారు. భారత సరిహద్దులో డ్రోన్లతో రెక్కీ నిర్వహిస్తున్నారు. మరోవైపు జవాన్ల పైకి కాల్పులు జరుపుతున్నారు. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు… సరిహద్దుల వెంట హై టెక్నాలజీ కెమెరాలను, సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా అయినా ఉగ్రమూకలు సరిహద్దులు దాటుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు భారత జవాన్లపై కాల్పులు జరుపుతున్నారు. ముష్కరులను అంతే దీటుగా భారత జవాన్లు అడ్డుకుంటున్నారు.