ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రెండు స్థానాలకు ఉపఎన్నికలు(By-elections) రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాయలసీమలోని తిరుపతి ఉప ఎన్నిక వేవ్ ఇంకా తగ్గకుండానే మరో రెండు ఉప ఎన్నికలకు అన్ని పార్టీలూ రెడీ అవుతున్నాయి. ఇందులో ఒకటి కడప జిల్లాలోని బద్వేలు కాన్సిస్టెన్సీ ఒకటి. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన వెంకట సుబ్బయ్య నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో ప్రాణాలు విడిచారు.
ఇక ఇదివరకే దీనికి ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడిందని తెలుస్తోంది. కాగా ఇప్పుడు కరోనా కస్తా తగ్గుముఖం పట్టడం, అలాగే ఆరు నెలల్లో ఇంకా రెండు నెలలే మిగిలి ఉండటంతో సెప్టెంబర్ వచ్చే అవకాశం ఉంది.
ఇక రెండోది విశాఖ నార్త్ సెగ్మెంట్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ను ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. కాగా ఆయన రాజీనామా పత్రంపై అసెంబ్లీ స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన రాజీనామా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ స్పీకర్ ఒకవేళ ఆమోదిస్తే దీనికి కూడా బద్వేల్ నియోజకవర్గంలో కలిసి ఎన్నికలు నిర్వహించే అవకాశంఉంది. అయితే ఇందులో బద్వేల్ లో వైసీపీకి తిరుగు లేకుండా ఉంది. ఇక్కడ జగన్ వేవ్ విపరీతంగా ఉంది. ఇక గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో కూడా వైసీపీ బలంగానే ఉన్నా కూడా ఇది టీడీపీకి సిట్టింగ్ స్థానం కావడంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.