మిర్చి భామకు పెళ్లి ఫిక్స్

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన రిచా గంగోపాధ్యాయ్ పెళ్లికి సిద్ధమైంది. బిజినెస్ స్కూల్ లో పరిచయమైన జోతో పెళ్లి ఫిక్స్ చేసుకుంది రిచా.. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా పూర్తయిందట. ఎంగేజ్మెంట్ అనంతరం తన అభిమానులకు తన కాబోయే భర్తతో కలిసి దిగిన పిక్ పెడుతూ ట్విట్టర్ లో తన పెళ్లి విషయాన్ని వెళ్లడించింది రిచా.

రానా నటించిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రిచా మిరపకాయ్, సారొచ్చారు, మిర్చి, భాయ్ సినిమాలు చేసింది. భాయ్ సినిమా తర్వాత స్టడీస్ కోసం వెళ్లిన రిచా అక్కడే జోను కలవడం వారు ప్రేమించుకోవడం ఫైనల్ గా ఇలా పెళ్లికి రెడీ అవడం జరిగిందట. కాబోయే శ్రీవారితో రిచా కనిపించి ఓ రకంగా తన ఫ్యాన్స్ కు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిందని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత అవకాశాలొస్తే నటిస్తుందో లేదో అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news