కరోనా విజృంభన వచ్చినప్పటి నుంచి మన దేశంలో వినిపిస్తున్న ఒకే ఒక్కపేరు సోనూసూద్ . ఎంతో మందికి ఈ ఆపద కాలంలో ఆయన అండగా నిలుస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు ఆయన ఎన్నో రకాలుగా సాయం అందిస్తున్నారు. అడిగింది లేదనకుండా ఆదుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆయన నేషనల్ రియల్ హీరోగా మారిపోయారు.
అయితే తాజాగా సోనూసూద్ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విష్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు నాకు నేర్పించిన జీవిత పాఠాలు కు కృతజ్ఞతలు. ఈ సందేశాలు నేను నిన్ను ఎంతగా మిస్ అవుతున్నాను ఎప్పుడూ చెప్పలేకపోయాను. మీరును లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్లీ చూసేందుకు ఎప్పుడూ అలాగే ఉంటుంది” అంటూ తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు సోనూసూద్. అలాగే తన తల్లికి సంబంధించిన ఫోటోలను కూడా సోనూసూద్ షేర్ చేశారు. కాగా సోనూసూద్ వాళ్ళ తల్లి 2007 సంవత్సరంలో మరణించగా.. ఆయన తండ్రి 2016 లో మృతి చెందారు. ఇక తాజాగా సోనూసూద్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ నెటిజన్ల మనసును కదిలిస్తోంది.
Happy birthday Maa❤️ I wish I could wish you personally & thank you for the lessons of life you have taught me. These messages can never express how much I miss you.The vaccum that has been created in my life without you will always remain the same till I see you again. pic.twitter.com/pUEylXOzsQ
— sonu sood (@SonuSood) July 21, 2021