అమెజాన్‌లో మళ్లీ ఆఫర్ల పండగ!

-

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడం ఫెస్టివల్‌ సేల్‌ను ప్రారంభించనుంది. ఇది అమెజాన్‌ ( Amazon ) షాపింగ్‌ ప్రియులకు శుభవార్త. ఈ నెల 5–7 వరకు నిర్వహించనుందని తెలిసింది. ఇక మొబైల్‌ గ్యాడ్జెట్లకు భారీ డిస్కౌంట్లతో సేల్‌ నిర్వహించనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సెల్‌ను అమెజాన్‌ అనౌన్స్‌ చేయనుంది. ఈ సేల్‌లో మొబైల్స్, యాక్సెసరీస్‌ మీద దాదాపు 40 శాతం వరకు డిస్కౌంట్‌ పొందొచ్చని అమెజాన్‌ చెబుతోంది. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌ మీద 60 శాతం, టీవీ ఇతర అప్లయెన్సెస్‌ మీద 55 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాదు బ్యాంక్‌ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులపై అదన పు డిస్కౌంట్‌ కూడా పొందనున్నారు. ఎస్‌బీఐ కార్డు పై∙10 శాతం డిస్కౌంట్‌ను కూడా అదనంగా ఇవ్వనున్నారు. వీటితోపాటు ఇతర క్యాష్‌బ్యాక్స్‌ కూడా ఉన్నాయి.

amazon | అమెజాన్‌
amazon | అమెజాన్‌
  • ప్రధానంగా కొత్తగా ల్యాప్‌టాప్‌ కొనేవారికి గరిçష్టంగా 30 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. ప్రింటర్లు ఇతర యాక్సెసరీల మీద 30 శాతం డిస్కౌంట్‌ ఇస్తారు.
  • 40,43 అంగుళాల టీవీలు కొనుగోలు చేస్తే 50 శాతం వరకు డిస్కౌంట్‌ పొందనున్నారు.
    స్మార్ట్‌వాచ్‌లు, వైఫై రూటర్లు, మెమొరీ కార్డులు, స్మార్ట్‌ సెక్యూరిటీ కెమెరాల మీద గరిష్టంగా 60 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.
  • ప్రైమ్‌ మెంబర్లు మూడు నెలల నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ అమెజాన్‌లో మళ్లీ ఆఫర్ల పండగ! ను సద్వినియోగం చేసుకోవచ్చు.
  • ఫైర్‌ టీవీ డివైజ్‌లు కొనుగోలు చేసినవారికి 44 శాతం తగ్గింపు లభిస్తుంది.
  • 4కే రిజల్యూషన్‌ టీవీలు, ప్రొజెక్టర్లు తీసుకుంటే 60 శాతం వరకు డిస్కౌంట్‌.

Read more RELATED
Recommended to you

Latest news