విద్యార్థులకు జగన్ శుభవార్త : డిజిటల్‌ లైబ్రరీల్లో స్టడీ మెటీరియల్

-

అమరావతి : ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలకు మంచి సామర్ధ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తోపాటు గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌కు ఉపయోగకరంగా డిజిటల్‌ లైబ్రరీలు ఉంటాయన్నారు.

డిజిటల్‌ లైబ్రరీల్లో కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు అందుబాటులో స్టడీ మెటీరియల్‌ అందిస్తామని.. గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇస్తామని ప్రకటించారు. నిరంతర ఇంటర్నెట్‌ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని.. ప్రతి గ్రామ పంచాయితీలోనూ డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. అక్కడ నుంచే పని చేసుకునే సదుపాయం ఉంటుందని.. మొదటి విడతలో 4530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపడుతామన్నారు. ఆగస్టు 15న పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలన్న సీఎం
స్థలాలు గుర్తించి హేండ్‌ ఓవర్‌ చేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news