“ఇప్పుడు కాక ఇంకెప్పుడు” సినిమా పై కేసు నమోదు..

“ఇప్పుడు కాక ఇంకెప్పుడు” సినిమా పై పోలీసు కేసు నమోదు అయింది. “ఇప్పుడు కాక ఇంకెప్పుడు” సినిమా పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సుమోటో కేసు నమోదు నమోదు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని పవిత్రంగా కీర్తించే… భజగోవిందం కీర్తన తో బెడ్ రూమ్ సన్నివేశాలు అసభ్యంగా చిత్రీకరించి… శ్రీకృష్ణ పరమాత్మను మరియు తులసి మాతను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది.

ఈ ఫిర్యాదును విహెచ్ పి రాష్ట్ర అధికార ప్రతినిధి రవి నూతన శశిధర్ మరియు బిజెపి మల్కాజిగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ పోచంపల్లి వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా రెండు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పాటలు, డైలాగ్స్, సీన్లు హిందు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీంతో 67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ల కింద “ఇప్పుడు కాక ఇంకెప్పుడు” సినిమా బృందంపై కేసులు నమోదు చేశారు పోలీసులు.