ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నెగిటివ్ ఎక్కువైపోతుందిగా!

-

చల్లా ధర్మారెడ్డి..తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించారు. 2014లో పరకాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. కానీ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా చల్లా, టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. ఇక 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున దిగి విజయం సాధించారు.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ముందుకెళుతున్న చల్లాపై పరకాల ప్రజల్లో వ్యతిరేకిత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. దానికి ప్రధాన కారణం జిల్లాల విభజనే. కొత్తగా ఏర్పడిన వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలోనే హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో కలిపి హన్మకొండ జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది.

ఇక ఇక్కడే అసలు రచ్చ మొదలైంది. పరకాలని ప్రత్యేక జిల్లా చేయాలని, ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. ‘పరకాల జిల్లా సాధన సమితి’ పేరుతో కొందరు ప్రతినిధులు ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఇక వీరికి ఇతర పార్టీలు మద్ధతు ఇస్తున్నాయి. అలాగే పరకాల ప్రజలు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. పరకాల డివిజన్‌ని ప్రభుత్వం కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తుందని వారు ఆందోళనలు చేస్తున్నారు.

ఇక ఈ ఆందోళనలని అణిచివేయాలని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చూస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఉద్యమకారులపై పోలీసు కేసులు కూడా పెట్టినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యేపై అక్కడి ప్రజల్లో అసంతృప్తి మొదలైనట్లు కనిపిస్తోంది. అలాగే స్థానికంగా ఉండే టీఆర్ఎస్ నేతలు సైతం పరకాలని ప్రత్యేక జిల్లాగా చేసేందుకు మద్ధతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రత్యేక జిల్లా ఉద్యమం ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యేకు బాగా నెగిటివ్ అయ్యేలా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news