నీ కుట్రలు సాగవ్ బిడ్డ… మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ఈటల

వరంగల్ అర్బన్: కమలాపూర్లో  బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజెపీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సదానందం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై రాటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ది ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న ఒడ్డు దిగాక బోడ మల్లన్న అనే తత్వమన్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే మనిషి కేసీఆర్ అని ఈటల వ్యాఖ్యానించారు.

Etela Rajender
Etela Rajender

కేవలం డబ్బులు, కుట్రలను నమ్ముకుని కేసీఆర్ ఎన్నికల్లోకి వస్తారని ఈటల ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ప్రజల ప్రేమ ముందు డబ్బులు, కుట్రలు పని చేయవన్నారు. తాను ప్రజల ప్రేమను నమ్ముకుని ముందుకు వెళుతున్నానని చెప్పారు. గ్రీన్ ఉడ్ బడిని బార్‌గా మార్చిన ఘనత చల్లా ధర్మారెడ్డికి దక్కుతుందని విమర్శించారు. కేసీఆర్ కుట్రలను నమ్ముకున్నాడని ఆరోపించారు. తెనేపూసిన కత్తి వంటి కడుపులో పెట్టుకుని కుట్రలు చేస్తే హుజూరాబాద్ ప్రజలు సహించరని వ్యాఖ్యానించారు. కోట్లు కుమ్మరించి హుజూర్ నగర్, నాగార్జున సాగర్ గెలువచ్చు కానీ హుజూరాబాద్‌లో కుట్రలు సాగవ్ బిడ్డ అంటూ సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు.