గూగుల్ డూడుల్ టుడే.. ఎయిర్ క్రాఫ్ట్ నడిపిన మొదటి మహిళకు గౌరవం.

-

గూగుల్ డూడుల్.. గూగుల్ ఓపెన్ చేయగానే వివిధ రకాల ఆకారాలతో, బొమ్మలతో ఆకర్షణీయంగా గూగుల్ పేరును మనకు చూపిస్తుంది. దాన్ని డూడుల్ అంటారు. ఈరోజు ఈ డూడుల్ లో భారతీయ వనిత సరళా తర్కల్ పేరును ఉంచింది. భారతదేశంలో మొట్ట మొదటిసారి ఎయిర్ క్రాఫ్ట్ నడిపిన మొదటి మహిళగా సరళా తక్రాల్ పేరు తెచ్చుకుంది. ఆమె 107వ జన్మదినం సందర్భంగా డూడుల్ తో గూగుల్ సత్కరించింది.

ఈ విషయమై వివరించిన గూగుల్, 1914లో బ్రిటీష్ ఇండియాలోని ఢిల్లీలోని జన్మించిన సరళా తక్రాల్, లాహోర్ కి వెళ్ళింది. అక్కడ ఆమె భర్త విమానాయానం చేయడంతో స్ఫూర్తి పొంది తాను శిక్షన తీసుకోవడం ప్రారంభించింది. 21సంవత్సరాల వయసులో సాంప్రదాయ చీరను ధరించి సోలో డబుల్ వింగ్డ్ విమానం కాక్ పిట్ లోకి అడుగు పెట్టింది. దాంతో ఆకాశం ఇక పురుషులది కాదు అనే సంకేతం దేశ వ్యాప్తంగా తేటతెల్లమైంది.

తక్రాల్ విజయం సంచలనంగా మారింది. ఆ తర్వాత చాలామంది మహిళలు విమానం నడపడంలో శిక్షణ పొందేందుకు ముందుకు వచ్చారు. ఆ తర్వాత లాహోర్ క్లబ్ విద్యార్థిగా శిక్షణ పొందేందుకు 1000గంటల విమాన ప్రయాణాన్ని ముగించింది. ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఆ సంవత్సరం తర్వాత వాణిజ్య పైలట్ కావడానికి సన్నాహకాలు పారంభించింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అది కుదరలేదు.

ఆ తర్వాత ఇండియా తిరిగి వచ్చిన తక్రాల్,, సంగీతం చిత్రలేఖనంలో నైపుణ్యం సాధించింది. ఏదేమైనా ఎయిర్ క్రాఫ్ట్ నడిపిన మొట్ట మొదటి భారత మహిళగా సరలా తక్రాల్ ఎంతో గుర్తింపును తెచ్చుకుంది. ఈ విజయం ఆ తర్వాత భారత మహిళల్లో ఎంతో ఆత్మగౌరవాన్ని నింపింది.

Read more RELATED
Recommended to you

Latest news