ప్రతిపక్షాలే కేసీఆర్‌కు ప్లస్ అవుతాయా?

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల దూకుడు పెరుగుతుంది. అధికార టీఆర్ఎస్‌ ( KCR ) కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు గళం విప్పుతున్నాయి. పైగా రాష్ట్రంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు బలపడుతున్నాయి. ప్రతి ఒక్కరూ కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ప్రతిపక్షాల బలం పెరిగేకొద్ది కేసీఆర్‌కే ప్లస్ కానుందా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తుంది.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఇప్పటికే టీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయి. కేసీఆర్‌కు చెక్ పెట్టి నెక్స్ట్ అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీలు చూస్తున్నాయి. అటు వైఎస్సార్ తనయురాలు షర్మిల సైతం కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు. ఇక ఐ‌పి‌ఎస్ పదవిని వదులుకుని మరీ ప్రవీణ్ కుమార్, బి‌ఎస్పిలో చేరి కేసీఆర్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.

తెలంగాణ కోసం పోరాడిన కోదండరాం ఆల్రెడీ పార్టీ పెట్టి రాజకీయం చేస్తున్నారు. అటు తీన్మార్ మల్లన్న సైతం తన సొంత సొంత టీంతో రాజకీయాలు మొదలుపెట్టారు. ఇక కమ్యూనిస్టులు ఎలాగో ఉన్నారు. అటు టీడీపీ కూడా ఉంది. అయితే ఈ ప్రతిపక్షాలన్నీ టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగానే పోరాడుతున్నాయి. ఇక వీరంతా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని అనుకుంటున్నాయి. ఇదే అంశం కేసీఆర్‌కు లబ్ది చేకూరేలా కనిపిస్తోంది. ఇలా వచ్చే ఎన్నికల్లో వీరంతా బరిలో దిగితే ఓట్లు చీలిపోయి, టీఆర్ఎస్‌కే బెనిఫిట్ అయ్యేలా కనిపిస్తోంది.

మామూలుగానే ప్రభుత్వ వ్యతిరేకిత ఓట్లు ప్రతిపక్షాలకు వెళ్తాయి. ఇప్పుడు  ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఓట్లు చీల్చుకోవడం గ్యారెంటీ. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే భారీగా ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో  టీఆర్ఎస్‌కే బెనిఫిట్ అయ్యి, మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news