Fact check: సోషల్ మీడియాలో వైరల్ అయిన పద్మశ్రీ అవార్డ్స్ 2021 నిజమేనా..?

-

తాజాగా నెట్టింట్లో పద్మశ్రీ అవార్డ్స్ ( Padma Shri Awards ) కి సంబంధించిన ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగా ఈ పోస్ట్ ని చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. పద్మ అవార్డులు ప్రకటించినట్లు దీనిలో ఏ బాలీవుడ్ యాక్టర్ కానీ క్రికెటర్ కానీ నాయకుడు కాని లేరు అని కేవలం సాధారణ ప్రజలకే పద్మ అవార్డులు ఇచ్చారని ఉంది.

Padma Shri Awards | పద్మశ్రీ అవార్డ్స్
Padma Shri Awards | పద్మశ్రీ అవార్డ్స్

అయితే ఈ పోస్ట్ కి సంబంధించిన వివరాలను మనం చూస్తే… తాజాగా వాట్సాప్ లో పద్మ అవార్డ్స్ 2021 పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. అయితే దీనిలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. అయితే వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న వార్త పద్మ అవార్డ్స్ 2021 లోది కాదు. వైరల్ అవుతున్న ఈ పోస్ట్ వట్టి ఫేక్ న్యూస్.

ఇది ఇలా ఉంటే పద్మ అవార్డ్స్-2022 కోసం ఆన్‌లైన్ నామినేషన్‌లు, సిఫార్సులు ప్రారంభమయ్యాయి. అయితే సెప్టెంబర్ 15 వరకు ఈ నామినేషన్లకు అవకాశం వుంది అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం నాడు తెలిపింది. ఈ నామినేషన్లలో సెలక్ట్ అయిన వారికి 2022 రిపబ్లిక్ డే సందర్భంగా అవార్డులు ప్రకటించబడతాయి అని కూడా తెలియజేయడం జరిగింది. అలానే పద్మ అవార్డుల కొరకు నామినేషన్లు, సిఫార్సులు పద్మ అవార్డు పోర్టల్‌ అయిన https://padmaawards.gov.in లో మాత్రమే స్వీకరించబడుతాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news