వీడియో వైరల్ : బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసిన నర్స్

-

నీ బుల్లెట్లు బండెక్కి వచ్చేస్తా వా… డుగ్గు.. డుగ్గు.. డుగ్గు అనే పాట సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పెళ్లి కూతిరి డ్యాన్స్‌ తో వైరల్‌ అయిన ఈ పాట ఓ సంచలనం సృష్టించింది. దీంతో చిన్న చిన్న యూ ట్యూబ్‌ ఛానల్స్‌ లోనూ ఊహించని వ్యూస్‌ వస్తున్నాయి. ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ ఎక్కడ చూసినా.. ఇదే పాట వినిపిస్తోంది. అయితే.. తాజాగా ఈ పాటతో మరో వీడియో సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలంలోని పీహెచ్‌ సీ లో ఆగస్ట్‌ 15 వ తేదీన బుల్లెట్‌ బండి పాట పై ఓ నర్స్‌ డాన్స్‌ చేసింది. ఆమె డ్యాన్స్‌ కు తోటి నర్సులు కూడా చప్పట్లు కొట్టి ప్రోత్సాహించారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే.. ఆ నర్సు డ్యాన్స్‌ చేసింది ఆస్పత్రి లోపల చేసింది. ఈ విషయం తెలిసిన జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌ ఆమెకు మెమో కూడా జారీ చేశారు. కాగా.. ఆస్పత్రిలో డ్యాన్స్‌ చేసిన నర్సు పేరు రజిత అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news