MEGA154 : చిరు, బాబీ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చేసింది

-

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌ డే.. ఇవాళ కావడం తో… ఆయన కు సంబంధించిన సినిమా అప్డేట్లు వరుసగా వస్తున్నాయి. తాజాగా డైరెక్టర్‌ బాబీ మరియు చిరంజీవి కాంబో లో రానున్న సినిమా పోస్టర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్‌ లో మెగాస్టార్‌ చిరంజీవి మాస్‌ లుక్‌ కనిపించాడు. చిరంజీవి సిగరేట్‌ తాగుతూ… నిల్చున్న ఈ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతోంది.

ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నటీ నటులు ఎవరనేది తెలియాల్సి ఉంది. కాగా… మలయాళీ చిత్ర లూసిఫర్‌ రీమేక్‌ గా మెహన్‌ రాజా రూపొందించిన చిత్రానికి గాడ్‌ ఫాదర్‌, తమిళ చిత్రం వేదాళం రీమేక్‌ గా మోహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్న చిత్రానికి భోళా శంకర్‌ అనే పేర్లు ఖరారైన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం చిరు ఆచార్య షూటింగ్‌ లో బిజీ గా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news