అధిక ఫీజులపై ఏపీ సర్కార్‌ ”టోల్‌ ఫ్రీ” నెంబర్‌ !

-

అమరావతి : ప్రైవేట్‌ స్కూల్స్‌ మరియు కాలేజీ ఫీజుల వ్యవహరంపై ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో ఫీజును నిర్దారించామని… ఇతర రాష్ట్రాల్లో స్కూల్ ఫీజులు నోటిఫై చేస్తారని ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కాంతారావు తెలిపారు. మన రాష్ట్రంలో గత 20 ఏళ్లుగా అలా జరగడం లేదని… నోటిఫై చేయాలి అనే విషయాన్ని కూడా మర్చిపోయారని పేర్కొన్నారు. దీనివల్ల ఎవరిష్టం వచ్చినట్టు వారు ఫీజులు వసూలు చేస్తున్నారని… కోవిడ్ సమయంలో 30 శాతం ఫీజు తగ్గించాలని 57 జిఓ ఇచ్చామని గుర్తు చేశారు. అయితే ఆ జీవో పై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని… మేనేజ్మెంట్లు చేసే ఒత్తిడికి ఫీజు విషయం లో పేరెంట్స్ లొంగిపోవద్దని కోరుతున్నామన్నారు.


ఎవరైనా మేం నిర్దారించిన ఫీజు కన్నా ఎక్కువ వసూలు చేస్తే వెనక్కి ఇప్పించే ఆలోచన చేస్తున్నామని… మేనేజ్మెంట్లు సుప్రీంకోర్ట్ ఆర్డరును ఫాలో కావాలని ఒక సర్క్యూలర్ ఇచ్చామన్నారు. వాళ్ళు రూల్స్ పాటిస్తే మేం ఎందుకు చర్యలు తీసుకుంటామని… మేం ఎలాంటి నోటీసులు ఇవ్వని కాలేజీలు కూడా కోర్టులకు వెళుతున్నాయని తెలిపారు.

అకార్యదర్శి ఆలూరి సాంబశివ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు రేగులేటరీ కమిషన్ వచ్చింది.. ఫీజ్‌ నిర్ధారిస్తున్నామని.. ఇప్పుడు తల్లిదండ్రులు ఫీజు ఎక్కువ ఉంటే మేం ఇచ్చిన జివో ప్రకారం యాజమాన్యాన్ని అడుగుతారని తెలిపారు. ఫీజు ఎక్కువ వసూలు చేసినా.. మరేదైనా పొరపాటు జరిగిందనే ఫిర్యాదు వచ్చినా.. విచారించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అధిక ఫీజులపై 91503 81111 నెంబరుకు పేరెంట్స్, పిల్లలు, టీచర్స్ ఉదయం 10 నుండి 5 గంటల మధ్య కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని… ఫిర్యాదు అందిన వారంలోగా యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news