చంద్రబాబుకు నా ఆస్తి రాసిస్తా : ఏపీ డిప్యూటీ సీఎం సంచలనం

-

తిరుపతి : చంద్రబాబుకు ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సవాల్ విసిరారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని… సమితి అధ్యక్షుడి నుంచి ఉప ముఖ్యమంత్రి హోదా వరకు నిజాయితీగా పనిచేశానని తెలిపారు. ఒక వేళ అవినీతి ఆరోపణలు నిజమైతే… నా ఆస్తిని చంద్రబాబుకు రాసి ఇస్తాను ….లేకపోతే చంద్రబాబు ఆస్తిని నాకు రాసి ఇవ్వాలని సవాల్‌ విసిరారు. డిప్యూటీ సిఎం నారాయణ స్వామి.

కృష్టాపురం, ఎన్టీఆర్ జలాశయాలు అభివృద్ధి చేయడానికి సిఎం జగన్ కోరానని.. జలాశయాల అభివృద్ధి సిఎం హామీ ఇచ్చారని తెలిపారు.. కుప్పం అభివృద్ధి చేస్తున్న ఘనత జగన్ అన్నదని.. కావాలంటే … చంద్రబాబు, తాను ఇద్దరు కలసి కుప్పం వెళ్ళి ప్రజలనే అడుగుదామన్నారు. “అవీనీతి చేయలేదని నేను కాణిపాకంలో సత్య ప్రయాణం చేయడానికి నేను సిద్దం …నువ్వు సిద్దామా చంద్రబాబు … అంత ధైర్యం ఉందా నీకు” అంటూ సవాల్‌ విసిరారు. తన పై వచ్చిన ఆరోపణల పై కావాలంటే సిబిఐ ఎంక్వయిరి చేయించుకోవచ్చని తెలిపారు. జగన్.. ఎపి సింహమని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news