బర్త్‌ డే గిఫ్ట్‌ : ”ఘోస్ట్‌” మారిపోయిన కింగ్‌ నాగ్‌ !

-

నేడు అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. ఈ నేపథ్యం లో అక్కినేని ఫ్యాన్స్‌ కు కింగ్ నాగార్జున అదిరిపోయే సర్‌ ఫ్రైజ్‌ ఇచ్చాడు. కింగ్‌ నాగార్జున నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ తో పాటు… టైటిల్‌ అనౌన్స్‌ చేసేశారు. ”ఘోస్ట్‌” అనే టైటిల్‌ తో ఈ సినిమా పోస్టర్‌ ను కాసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్‌ లో నాగార్జున డాన్‌ గెటప్‌ లో కనిపించాడు.

ఆ పోస్టర్‌ చూస్తుంటే…నాగ్ నటించిన డాన్‌ సినిమా స్టోరీ యాంగిల్‌ లో ఉండేలా కనిపిస్తోంది. ఇక తాజాగా అనౌన్స్‌ చేసిన ఈ మూవీని స్టార్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తార్‌ తెరకెక్కుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు శరత్‌ మారార్ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా లో కింగ్‌ నాగార్జున సరసన కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news