కరోనా సోకుతుందన్న భయం ఏ రేంజిలో ఉందో, సోకిన తర్వాత చికిత్స తీసుకోవడానికి అయ్యే ఖర్చు పెట్టే భయం దానికన్నా రెట్టింపులో ఉంది. సామాన్యులు భరించలేని ఖర్చు, కరోనా చికిత్సలకు అవుతున్నాయని రోజూ వార్తల్లో వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలు సామాన్యులకి అందుబాటులో ఉండేలా చేయాలన్న వాదనలు ప్రభుత్వం వద్దకు వస్తూనే ఉన్నాయి.ఐతే ప్రస్తుతం ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
కోవిడ్ చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చింది. మొత్తం కరోనా చికిత్సలను 15రకాలుగా విభజించింది. ఈ చికిత్సలన్నీ ఆరోగ్యశ్రీలోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ కింద 1026 చికిత్సలు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ఆరోగ్య శ్రీ సేవలు విస్తరిస్తాయని తెలిపింది. దీంతో సామాన్యులకి కరోనా ఖర్చు భారం ఎక్కువగా ఉండదని అనుకుంటున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ చికిత్సని ఆరోగ్యశ్రీలో చేర్చిన సంగతి తెలిసిందే.