నైజాం వదిలేస్తున్న దిల్ రాజు..!

-

టైటిల్ చూసి దిల్ రాజు ఏంటి నైజాం వదిలిపెట్టి వెళ్లడం ఏంటని కాస్త షాక్ అవ్వొచ్చు. నైజాం లో బడా డిస్ట్రిబ్యూటర్ గా పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల దాకా సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు ఇక మీదట డిస్ట్రిబ్యూషన్ కు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జగపతి బాబు పెళ్లిపందిరి సినిమా నుండి డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు తొలిప్రేమ, ఆది సినిమాలతో మంచి లాభాలు తెచ్చుకున్నాడు.

2017-18 సంవత్సరాల్లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు ఆయనకు భారీగా లాసులు తెచ్చాయి. నిర్మాతగా కూడా లాసులు ఎదుర్కుంటున్న దిల్ రాజు సినిమా డిస్ట్రిబ్యూషన్ ను ఆపేసే ఆలోచనలో ఉన్నాడట. నైజాం లో స్టార్ డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు తెలుగు రెండు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్స్ సొంతంగా నిర్మించడమే కాకుండా కొన్నిటిని తన చేతుల్లో ఉంచుకున్నాడు. తన సొంత వాటిల్లో తన సినిమాలను వేసుకుంటూ ఇక డిస్ట్రిబ్యూషన్ కు గుడ్ బై చెప్పేసే ఆలోచనలో ఉన్నాడు దిల్ రాజు. మరి అది సాధ్యమయ్యే పనేనా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news