స్వైన్‌ ఫ్లూ రాకుండా ఉండాలంటే.. ఈ సూచనలు పాటించాలి..!

-

ప్రస్తుతం ఓ వైపు చలి చంపేస్తుంటే.. మరో వైపు చాలా మంది దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం తదితర అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సీజన్‌లో స్వైన్‌ ఫ్లూ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ వ్యాధి బారిన పడి అనేక మంది మరణిస్తున్నారు కూడా. కనుక ప్రతి ఒక్కరు స్వైన్‌ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కింద తెలిపిన సూచనలు పాటిస్తే స్వైన్‌ ఫ్లూ బారి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే…

1. నిత్యం ఉదయాన్నే పరగడుపునే 5 తులసి ఆకులను బాగా కడిగి వాటిని అలాగే నమిలి మింగాలి. తులసి వల్ల గొంతు, ఊపిరితిత్తులు క్లియర్‌ అవుతాయి. అలాగే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. స్వైన్‌ ఫ్లూ బారి నుంచి తప్పించుకోవచ్చు.

2. నెలకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి ఒక చిన్న కర్పూరం బిళ్లను మింగండి. భయపడకండి. కర్పూరం మన శరీర రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అయితే డోసు చాలా చిన్నగా ఉండేలా చూసుకోండి. మరీ పెద్ద డోసు పనికిరాదు.

3. నిత్యం ఉదయాన్నే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను అలాగే నమిలి మింగాలి. అనంతరం గోరు వెచ్చని నీటిని తాగాలి. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల వైరస్‌లు, బాక్టీరియాల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

4. రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో లేదా పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగాలి. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

5. ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్‌ అలోవెరా జెల్‌ తినాలి. అనంతరం నీటిని తాగాలి. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

6. ప్రాణాయామం చేయడం వల్ల కూడా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే విటమిన్‌ సి ఉన్న పండ్లను నిత్యం తీసుకోవాలి. దీని వల్ల రోగాల నుంచి రక్షణ లభించడమే కాదు శరీర రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. స్వైన్‌ ఫ్లూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news