టీడీపీలో గుబులు: లోకేష్ అరెస్ట్ ఖాయం?

-

ఇప్పటికే ఉన్న సమస్యలు చాలవన్నట్లు… ఏపీలో టీడీపీకి కొత్త గుబులు ఒకటి పట్టుకుంది. ఏ క్షణం చినబాబును సీఐడీ అధికారులు పట్టుకెళ్లిపోతారానో అన్న టెన్షన్ స్టార్ట్ అయ్యింది. దీంతో లోకేష్ ప్రత్యక్ష రాజకీయ భవిష్యత్తు… ఉదయించకుండానే అస్తమించే పరిస్థితికి చేరుకున్నట్లయ్యిందనే కామెంట్లు మొదలైపోయాయి!

nara lokesh

చంద్రబాబు కేబినెట్ లో ఐటీశాఖ మంత్రి ఆయన కుమారుడు లోకేష్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఫైబర్ నెట్ ను స్వయంగా లోకేష్ మంత్రిగా అమలు చేశారు. ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఈ స్కాంలో అక్రమాలకు పాల్పడ్డారనే అంశంపైనే సీఐడీ విచారణ సాగింది. అందులో 2వేల కోట్ల మేర అవినీతి జరిగిందంటూ ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు కీలక సమాచారాన్ని వెలుగులోకి తెచ్చారు.

దీంతో… ఏపీ టీడీపీ నేతలకు ఫైబర్ గ్రిడ్ టెన్షన్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. దానికి కారణం… గత చంద్రబాబు ప్రభుత్వంలో వెలుగుచూసిన ఫైబర్ నెట్ స్కాంలో తాజాగా తొలి అరెస్ట్ జరిగింది. అవును… ఫైబర్ నెట్ స్కాంలో సాంబశివరావును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆయన ఇన్ ప్ట్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు సీఐడీ కోర్టులో హాజరు పరుచనున్నట్లు తెలుస్తోంది.

ఇలా సాంబశివరావు అరెస్ట్ అవ్వడంతో టీడీపీలో గుబులు మొదలైంది. ఈ ఫైబర్ నెట్ ను దగ్గరుండి అమలు చేయించింది మంత్రి లోకేష్ కావడంతో… ఆయన అరెస్ట్ ఖాయమన్న ప్రచారం మొదలైంది.

కాగా… జగన్ ప్రభుత్వం గద్దెనెక్కగానే చంద్రబాబు హయాంలోని అక్రమాలు అవినీతిపై ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ… మాజీ మంత్రి నారాలోకేష్ కు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కేంద్రంగా ఫైబర్ గ్రిడ్ లో అవినీతి సాగినట్టు తేల్చిన సంగతి తెలిసిందే!

Read more RELATED
Recommended to you

Latest news