ఇంగ్లాండ్ వేమౌత్‌లోని వైక్ రెగిస్‌లోని ఆల్ సెయింట్స్ స్కూల్ లో ఓ వింత రూల్ పెట్టింది యాజమాన్యం. స్కూల్ కు వచ్చే పిల్లలు… తరగతులు జరుగుతున్న సమయం లో అస్సలు టాయిలెట్ వెళ్లకూడదని రూల్స్ పెట్టింది. ఎంత అత్యవరసరమున్న… వెళ్లడానికి వీలు లేదని పేర్కొంది. అయితే… తరగతులు జరుగుతున్న సమయం లో కచ్చితంగా టాయిలెట్ వెళ్లాలని అనుకుంటే… ఏదైనా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురావాలని..నిబంధనలు పెట్టింది.
ఆ సర్టిఫికేట్ ఉన్న వారే… క్లాస్ ల మధ్యలో టాయిలెట్ వెళ్లడానికి అనుమతి ఉందని పేర్కొంది. అయితే… ఈ రూల్స్ పై విద్యార్థుల తల్లిదండ్రులు.. పాఠశాల యాజమాన్యంపై మండిపడుతున్నారు. డాక్టర్ సర్టిఫికెట్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. గర్ల్స్ కు పిరియడ్స్ వస్తే ఎలా అని మండిపడుతున్నారు తల్లిదండ్రులు. అలాంటి విద్యార్థులు పిరియడ్స్ రాకుండా మాత్రలు వేసుకోవాలని కూడా చెబుతున్నారు స్కూల్ ఉపాధ్యాయులు. ఇక ఈ స్కూల్ రూల్స్ గురించి తెలిసిన వారు… తీవ్ర స్థాయి లో మండిపడుతున్నారు.