“KIA”లో సీనియర్ జూనియర్ వార్..రాడ్ల తో దాడులు.!

-

ప్రముఖ పరిశ్రమ కియా లో ఉద్యోగుల మధ్య ఘర్షణలు నెలకొనడం సంచలనం గా మారింది. అనంతపురం లోని కియా పరిశ్రమ లో పని చేస్తున్న వారిలో సీనియర్లు మరియు జూనియర్ల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు రాడ్లతో దాడులు చేసుకున్నారు. పరిశ్రమలో సీనియర్లు మరియు జూనియర్లు ఒకరిపై ఒకరు ఇనప రాడ్లతో దాడి చేసుకున్నారు.

ప్రధాన ప్లాంట్ లో హ్యుందాయ్..ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నే ఉద్యోగులు దాడులు చేసుకుంటున్నారు. అయితే ఉద్యోగులు ఆ స్థాయిలో దాడులు చేసుకుంటున్నా కూడా పరిశ్రమ ప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో కియా లో పని చేస్తున్న ఉద్యోగులు భయాందోళన కు గురవుతున్నారు. ఈ గొడవలు ఉద్యోగుల మధ్య ఎలాంటి ఘర్షణల కు దారి తిస్తాయో అని ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news