నాలుకలు తెగ కోస్తా : బండి సంజయ్ కి రసమయి వార్నింగ్ !

-

బిజెపి, కాంగ్రెస్ నాయకులపై ఘాటు వాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో ఎమ్మెల్యే రసమయి మీడియా తో మాట్లాడుతూ బండి సంజయ్ ది విహారాయత్రనో ? ఎం యాత్రనో ? ఎవరికి తెలియదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి యాత్ర అని పెట్టుకుంటే బాగుంటుందని చురకలు అంటించారు. బండి సంజయ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు ఈమధ్య చెప్పుకోలేని విధంగా అసభ్యకరంగా మాటలు తిడుతున్నారని మండిపడ్డారు.

మాటలు మర్యాదగా మాట్లాడకపోతే నాలుకలు తెగ కోస్తా నని హెచ్చరించారు. యాత్ర పేరుతో తిరుగుతున్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మానకొండూర్ కు ఎన్ని నిధులు ఇచ్చాడో నియోజకవర్గ ప్రజలకు స్పష్టం చేయాలని తెలిపారు. తాను ఎమ్మెల్యే గా రూ. 20 కోట్ల నిధులు తెచ్చానని.. ఎంపీ బండి సంజయ్ 20 రూపాయలు అయినా ఇచ్చినాడా ? అని నిలదీశారు. బండి సంజయ్ కు బెజ్జంకి మండలంలో అడుగుపెట్టే అర్హత ఉందా ? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.

 

Read more RELATED
Recommended to you

Latest news