ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈరోజు ఉదయం 11గంటలకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభం కానుంది. వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లాంచ్ చేయనున్నారు. ఈ పథకాన్ని ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ లేదా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అని కూడా పిలుస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డిజిటల్ మిషన్ ప్రారంభిస్తామని మాటిచ్చిన ప్రధాని, పైలట్ ప్రాజెక్టుగా 6కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నారు.
దీని ప్రకారం వైద్య రంగంలో సరికొత్త సాంకేతికను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చేందుకు అవసరమైన వనరులు అందుబాటులో ఉంచుతూ, వైద్య రంగానికి మేలు చేసే ఎన్నో విధానాలు అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ కూడా చేసారు.