ఫేక్‌ లెటర్‌ పై ఈటల రాజేందర్‌ క్లారిటీ

-

ఈటల రాజేందర్‌.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారంటూ… నిన్నటి నుంచి హుజురాబాద్‌ నియోజక వర్గంలో పెద్ద రాజకీయ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే… ఆ లేఖ పై తాజాగా ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. దొంగ లెటర్ మీద మళ్లీ ధర్నాలు చేయిస్తున్నారని… అన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ ఆడుతున్న నాటకాలన్నారు. తానే ఎన్నికల కంటే ముందు దళిత బంధు అన్నీ కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు.

తన వల్ల రూ. 10 లక్షలు రావడం… చాలా గొప్ప విషయమని.. దీనిపై తాను లేఖ రాయలేదన్నారు. అంతే కాదు ఇతర కులాల్లో ఉన్నవారికి కూడా రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది తానేన్నారు. కానీ తాను రాసినట్టు ఒక అబద్ధపు లెటర్ పుట్టించి… చిల్లర పనులు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులపై నిప్పులు చెరిగారు ఈటల రాజేందర్‌.

ఇలాంటి పనులు చేసి… అభాసు పాలు చేస్తారు అప్రమత్తంగా ఉండాలని… మన ఓటు మనం వేసుకుందాం… కెసిఆర్ అహంకారాన్ని అణచివేద్దామని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి ఇచ్చిండా? ఉద్యోగాలు వచ్చాయా?అని కేసీఆర్‌ సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు. కెసిఆర్ దగ్గర బానిస లెక్క ఉంటేనే మంచి వాడు…. లేకుంటే కంట్లో పెట్టుకుంటారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news