తెలంగాణలో కాంగ్రెస్ గత వైభవం కోసం ప్రయత్నాలు చేస్తుంది. అందుకే అన్ని వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకునేలా కార్యాచరణను రూపొందించుకుంటుంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ కు జవసత్వాలు తీసుకువచ్చేలా యాత్రలు చేస్తున్నారు. ఇతర ముఖ్యనేతలు కూడా ఎప్పటికప్పడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తాాజాగా యువత, విద్యార్థి సమస్యలపై శంఖాారావం పూరించాయి. అక్టోబర్ 2 నుంచి 9 వరకు విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ లతో పాటు బట్టి విక్రమార్కలు పాల్గొననున్నారు. తెలంగాణలో విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై నిరసన వ్యక్తం చేయనున్నారు.
ముఖ్యంగా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనుంది. హుజూరాబాద్ ఎన్నికల వేళ ప్రస్తుతం కాంగ్రెస్ చేపడుతన్న నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమం ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.