షాకింగ్ : చెత్తబుట్టలోకి తమిళ అర్జున్ రెడ్డి..!

-

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి. ఈ సినిమాను తమిళంలో చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా చేస్తున్నాడు. సీనియర్ డైరక్టర్ బాలా ఈ రీమేక్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈమధ్యనే టీజర్, ట్రైలర్ రిలీజ్ అవగా సినిమా రిలీజ్ కు రెడీ అయ్యిందని అనుకున్నారు. కాని ఫస్ట్ కాపీ చూశాక సినిమా అవుట్ పుట్ మీద అసంతృప్తి మొదలైందట.

ఈ4 ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు సినిమాలా ట్రెండీగా కాకుండా ఓ రొటీన్ సినిమాగా వచ్చిందట. అందుకే సినిమా మొత్తాన్ని మళ్లీ రీ షూట్ చేయాలని నిర్ణయించారట. కేవలం హీరో ఒక్కడినే ఉంచి మిగతా కాస్ట్ అండ్ క్రూ మొత్తం మార్చేస్తున్నారట. ఓ సినిమా ఇలా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక మళ్లీ మొత్తం సినిమా రీ షూట్ చేయాలనుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి.

Read more RELATED
Recommended to you

Latest news