నేటి కాలంలో చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. హైబీపీని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేదు అంటే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హైబీపీ కారణంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి హైబీపీ సమస్య ఉన్నవాళ్లు అసలు దానిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ విధంగా కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా హైబీపీని తగ్గించుకోవచ్చు. అయితే మరి హైబిపిని ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం.
డాక్టర్ తో మాట్లాడండి:
హైబీపీ సమస్య కనుక మీకు ఉంటే కచ్చితంగా డాక్టర్ తో మాట్లాడండి. అలానే మీరు ఫ్యామిలీ హిస్టరీ గురించి కూడా డాక్టర్ కి చెప్పండి. దీనితో ముందు నుండి కూడా మీరు జాగ్రత్త పడొచ్చు.
ఒత్తిడిని తగ్గించుకోండి:
ఒత్తిడి కారణంగా హైబీపీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేట్టు చూసుకోండి. మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అలానే కాసేపు నడవడం వల్ల కూడా మీకు మంచి బెనిఫిట్ గా ఉంటుంది.
బరువు తగ్గడం:
బరువు తగ్గడం వల్ల కూడా మీరు హైబీపీకి చెక్ పెట్టొచ్చు. హైబీపీ ఉన్నవాళ్లు బరువుగా ఉండటం వల్ల కాంప్లికేషన్స్ పెరిగిపోతాయి. కాబట్టి సరైన బరువు కూడా మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం.
రోజు వ్యాయామం చేయండి:
కనీసం వారానికి 150 నిమిషాల పాటు నడిస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల బీపీ తగ్గుతుంది కాబట్టి కచ్చితంగా వ్యాయామం చేయండి.
ఆరోగ్యకరమైన ఆహారం:
మీరు తీసుకొనే డైట్ ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలు రావు. కనుక ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను ఎక్కువగా మీ డైట్ లో తీసుకోండి.
స్మోకింగ్ కి దూరంగా ఉండండి:
పొగ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి పొగతాగే అలవాటు మీకు ఉంటే మానేయండి. ఇలా చేయడం వల్ల బీపీ తగ్గుతుంది. అలానే హృదయ సంబంధిత సమస్యల రిస్క్ కూడా తగ్గుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి రాకుండా కూడా జాగ్రత్త పడొచ్చు.