హుజూరాబాద్ పోరు రణరంగాన్ని తపిస్తోంది. ప్రధాన పార్టీలు శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు రసవత్తరం ఉంది. ఇదిలా ఉంటే హుజూరాబాద్ లో ప్రచారంతో పాటు ప్రలోభాలకు కూడా తేరలేచింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బును ఎరవేయాలని కొంత మంది భావిస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గానికి వివిధ మార్గాల్లో డబ్బును చేరవేసేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట పట్టణంలో సరైన అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 10.40 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. ఇదిలా ఉంటే కరీంనగర్ అల్గనూర్ చౌరస్తాలో హుజూరాబాద్ వైపు తరలిస్తున్న రూ. 4.50 లక్షలను స్వాధీనం చేసుకుని సరైన పత్రాలు లేకపోవడంతో ఇన్ కం టాక్స్ డిపార్టమెంట్ కు అప్పగించారు. హుజూరాబాద్ వైపు వెళ్లే పలు మార్గాలపై అధికారులు కన్నేశారు. హన్మకొండ, వరంగల్ ప్రధాన రహదారిపై పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
హుజూరాబాద్ బైపోల్.. తనిఖీల్లో పట్టుబడుతున్న నగదు..
-