prabhas 25 : “స్పిరిట్” తో వచ్చేసిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్

-

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌… గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ గా ఎదిగిపోయారు ప్రభాస్‌. దీంతో చిత్ర పరిశ్రమలో ఫుల్‌ బిజీ అయ్యారు ప్రభాస్‌. రాధే శ్యామ్‌ తర్వాత ప్రభాస్‌… తన తర్వాతి ప్రాజెక్ట్‌ ను నాగ్‌ అశ్విన్‌ తో ప్రకటించారు. కానీ మధ్యలో ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ మూవీతో పాటు ఓం రౌత్‌ ఆదిపురుష్‌ సినిమాలను మొదలు పెట్టారు ప్రభాస్‌.

దీంతో పాటు మరో ఇద్దరు దర్శకులను లైన్‌ లో పెట్టారు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. ఈ నేపథ్యం లోనే తాజాగా ప్రభాస్‌ 25 వ సినిమా అనౌన్స్‌ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్టు నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ వార్తలను నిజం చేస్తూ.. తాజాగా వీరి కాంబోలో సినిమాను అఫిషియల్‌ గా అనౌన్స్‌ చేశారు.

అంతేకాదు.. ఈ సినిమా టైటిల్‌ ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం.  “స్పిరిట్‌ ” అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ ను ప్రకటించంది చిత్ర బృందం. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అంతేకాదు.. ఈ సినిమాను ఏకంగా 8 భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news