కేసీఆర్ కుర్చీకి ఎసరు పెట్టింది హరీష్, కేటీఆరే : ఈటల సంచలనం

-

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. పదవుల కోసం పెదవులు మూసింది హరీష్ రావు అని… సీఎం కుర్చీకి ఎసరు పెట్టింది హరీష్, కేటీఆర్ లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల. కెసిఆర్ కుటుంబ సభ్యులే అబద్దాల కోరులని… దళిత ముఖ్యమంత్రి ఇస్తానని ఇవ్వని మోసగాడు కేసీఆర్‌ అని ఫైర్‌ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చి తీసివేసి అవమానించిన వాడని… దళిత అధికారులకు గౌరవం లేదని ఆగ్రహించారు.

ప్రదీప్ చంద్రకు మీరు ఇచ్చిన గౌరవం ఏంది… దళిత బిడ్డ అని రిటైర్డ్ మెంట్ ఫంక్షన్ కి రాలేదన్నారు. అకునూరి మురళి ఉసురు పోసుకున్నవాడు కెసిఆర్ అని నిప్పులు చెరిగారు. ఇచ్చే ధైర్యం లేదు, ఇవ్వాలనే ప్రేమ లేదు కాబట్టి దళిత బంధు డబ్బులు ఇవ్వడం లేదని…సీఎం కెసిఆర్ మరియు హరీష్ రావు తన పేరు మీద దొంగ లేఖ తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే పార్టీలు గెలిచిన నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాలు ఆగిపోయాయా? ఇక్కడ ఎలా ఆగిపోతాయని ప్రశ్నించారు. దళిత బంధు రాకపోతే భాధ్యత తనదేనని.. ఇవ్వకపోతే కెసిఆర్ కి చావు డప్పు కొట్టుడు ఖాయం అని శోభక్క అంటుందన్నారు. ఆత్మగౌరవం కోసం తనకే ఓటేయాలని కోరారు ఈటల రాజేందర్‌.

Read more RELATED
Recommended to you

Latest news