గులాబ్ తుఫాన్ కలిగించిన నష్టం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. తాజాగా బంగాళా ఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చిరించింది. ఈ నెల 13,14 తేదీల్లో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడనుంది. దీంతో కొస్తాంధ్రకు ముప్పు పొంచి ఉంది. ఈనెల 15న తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల మొదటివారంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ కారణంగా కోస్తాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. విస్తారంగా వానలు కురవడంతో నదులు, వాగులు పొంగిపొర్లాయి. రహదారలు చెరువును తలపించాయి. ముఖ్యంగా హైదరాబాద్ గులాబ్ ధాటికి వణికిపోయింది. ప్రస్తుతం మరో తుఫాన్ ఏర్పడుతుండటంతో కోస్తాంధ్ర జిల్లా వాసుల్లో అలజడి నెలకొంది.
బంగాళాఖాతంలో మరో తుఫాన్…!
-