కేసీఆర్‌పై అమిత్ షాకు తీన్మార్ మల్లన్న కుటుంబం ఫిర్యాదు !

-

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో తీన్మార్ మల్లన్న కుటుంబం భేటీ అయింది. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ తో కలిసి అమిత్ షా ను భేటీ అయింది తీన్మార్ మల్లన్న కుటుంబం. సుమారు ఇరవై నిమిషాల పాటు అమిత్ షా మాట్లాడారు ధర్మపురి అర్వింద్ మరియు తీన్మార్ మల్లన్న కుటుంబం.
మల్లన్న పై పెట్టిన కక్ష్య పూరిత కేసుల పై అమిత్ షాకు ఈ సందర్భంగా వివరించింది తీన్మార్‌ మల్లన్న కుటుంబం.

మల్లన్న భార్య మతమ్మ , తమ్ముడు వెంకటేష్ తో కలిసి అమిత్ షా తో భేటీ అయ్యారు ఎంపీ ధర్మపురి అర్వింద్. ఇక తీన్మార్‌ మల్లన్న ఫిర్యాదు నేపథ్యంలో చాలా సానుకూలంగా అమిత్‌ షా స్పందించారని… ఎంపీ అరవింద్‌ చెప్పారు. మల్లన్నను జైలు నుంచి విడుదల కాకుండా ఉండేలా పోలీసులు పీటీ వారెంట్లను అమలు చేస్తున్నట్లుగా అర్థమవు తోందని పేర్కొని, తెలంగాణ హై కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిన విషయాన్ని అమిత్‌ షాకు వివరించామన్నారు ఎంపీ అరవింద్‌.

Read more RELATED
Recommended to you

Latest news