MAA elections 2021: మెగా బ‌ద్ర‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..! ప్రాంతీయ వాదం.. సంకుచిత మనస్తత్వం ఉన్న చోట ఉండ‌లేను

-

MAA elections 2021: గ‌తంలో ఎన్నాడు లేని విధంగా.. సాధార‌ణ ఎన్నిక‌లకు ఏ మాత్రం తీసిపోకుండా.. రస‌వ‌త్తరంగా సాగిన మూవీ ఆర్టిస్టు అసోషియేష‌న్ (మా) ఎన్నిక‌లు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో మంచు విష్ణు ఘన విజయం సాధించాడు. మంచు విష్ణు కు 381 ఓట్లు నమోదు కాగా.. ప్రకాష్ రాజ్ 274 ఓట్లు పొందాడు.విష్ణు ప్యాన‌ల్ వారికే..అధిక సీటు రావ‌డం గ‌మ‌నార్హం. శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ నుంచి గెలుపొందారు.

ఈ త‌రుణంలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సంచల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తాను మ‌ద్ద‌తు ప‌లికిన ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ ఓడిపోవ‌డంతో ఎవ్వ‌రూ ఊహించని విధంగా చేశారు. ఏకంగా నాగ‌బాబు మా ను
వ‌దులుకున్నారు. త‌న ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక‌గా తెలిపారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. “ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. సెలవు. – నాగబాబు, అంటూ రాసుకోచ్చారు. అలాగే ఈ రోజు సాయంత్రం 7 గంటలకు సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు వస్తానని ప్రశ్నలు ఏమైనా ఉంటే అక్కడ తనని అడగాలని వ‌చ్చాని తెలిపారు.

Image

Read more RELATED
Recommended to you

Latest news