Allu Arjun: అక్కినేని బ్ర‌ద‌ర్స్ పై ఐకాన్ స్టార్ సెన్సెష‌న‌ల్ కామెంట్స్..! ఏమన్నాడంటే?

-

Allu Arjun: అక్కినేని అఖిల్ గాండ్ర్ సాధించిన చిత్రం .. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పకులు ఈ చిత్రానికి. ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ జంటగా టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టించింది. దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఈ సందర్భంగా గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ మేక‌ర్స్. ఈ ప్రోగ్రామ్ కి అల్లు అర్జున్ చీప్ గెస్ట్ గా వ‌చ్చి తనదైన మాటలతో ఆకట్టుకున్నారు. తొలుత అక్కినేని అఖిల్‌కి కంగ్రాట్స్ చెప్పాడు. అఖిల్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అఖిల్‌లో ఎప్పుడు చూసినా ఓ స్వీట్‌నెస్ ఉంటుందని, అతనికి ఇంత పెద్ద హిట్ రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అఖిల్‌ చాలా డ్యాన్స్ సూప‌ర్ చేస్తాడు, ఫైట్ అదుర్స్. వాటన్నిటినీ పక్కనపెట్టి, ఈ సినిమా కోసం అఖిల్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని తెలిపారు.

ఈ క్ర‌మంలో అక్కినేని ఫ్యామిలీతో తమ ఫ్యామిలీ ప్రయాణం ఎన్నో డికేడ్స్‌గా నడుస్తోందని ఆ ప్రయాణం ఇలా కొనసాగుతూ ఉండాలని ఆశించారు. రీసెంట్‌గా ‘లవ్ స్టోరీ’ సినిమాతో నాగ చైతన్య సూపర్ హిట్ కొట్టగా.. ఇప్పుడు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రూపంలో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారని అక్కినేని ఫ్యామిలీకి ఇది బ్యూటిఫుల్ మూమెంట్ అని అల్లు అర్జున్ అన్నారు. ఈ మూమెంట్‌లో కింగ్ నాగ్ ఎంత సంతోష పడుతున్నారో తనకు తెలుసని అల్లు అర్జున్ అన్నారు.

పూజ హెగ్డే గురించి మాట్లాడుతూ.. పూజా నటన పరంగా ఈ చిత్రంతో రెండు మెట్లు ఎక్కిందని, సినిమా సినిమాకు ఆమెలో అందంతో పాటు నటనా ప్రతిభ మెరుగుపడుతోందని చెప్పారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌కు విజయం అందడంతో ఆనందంగా ఉందన్నారు. అత్యుత్తమ సినిమాలు తీస్తున్న త‌న నాన్న బెస్ట్ అని ప్ర‌సంశించారు.

Read more RELATED
Recommended to you

Latest news