హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మత్తు లో ఓ చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన రాజేంద్రనగర్ శివారులో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… కాంతు అనే యువకుడు గంజాయి మత్తులో… ఏకంగా నాలుగు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు ఇప్పిస్తానని నమ్మించి ఆ చిన్నారిని ఇంట్లోనుంచి బయటకి తీసుకు వెళ్ళాడు కాంతు.
చాక్లెట్లు ఇప్పించిన అనంతరం ఆ చిన్నారిపై లైంగిక దాడి చేశాడు కామాంధుడు కాంతు. అయితే ఆ చిన్నారికి రక్తస్రావం కావడంతో గుర్తించిన తల్లి… కాంతు ను నిలదీసింది. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆ చిన్నారి తల్లి ని బెదిరించాడు కామాంధుడు కాంతు. అవసరమైతే నిన్ను కూడా రేప్ చేసి చంపేస్తే తానంటూ ఆ తల్లిని భయాందోళనకు గురి చేశాడు కాంతు. అయితే స్థానికుల సహాయంతో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఆ కామాంధుడి పై ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… ఆ కామాంధుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి…అరెస్టు చేశారు.