ఏపీలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ లోని కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రం నుండి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెళ్లిపోగా ఈ నెల 26 నుండి ఈశాన్య రుతుపవనాల రాక ప్రారంభంకానుంది దాని ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు నిండిపోయాయి. ఇక నిన్న చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏకంగా 106.4 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదయింది. అంతే కాకుండా తిరుపతి లో భారీ వర్షానికి ఓ పెళ్లి వాహనం వరదల్లో చిక్కుకుపోవడంతో నవ వధువు ఊపిరి ఆడక చనిపోవడం కలకలం రేపింది.